ఎన్టీఆర్ జయంతిపై బీజేపీ నేత సునీల్ దేవధర్ ఆసక్తికర ట్వీట్!
- కాంగ్రెస్ ముక్త ఆంధ్రప్రదేశ్‌కు బీజం వేసింది ఎన్టీఆరేనన్న దేవధర్
- పౌరాణిక పాత్రలలో ప్రాణం నిలిపిన మహా నటుడు అంటూ కితాబు
- ఎన్టీఆర్‌కు 99వ జయంతి వేడుకల శుభాకాంక్షలన్న సునీల్
ఎన్టీఆర్‌ను కదిలే బొమ్మలతో కోట్లాది మంది హృదయాలను జయించిన నట సార్వభౌముడిగా అభివర్ణించిన సునీల్.. పౌరాణిక పాత్రలలో ప్రాణం నిలిపిన మహా నటుడుగానూ పేర్కొన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తిగా ఎన్టీఆర్‌ను చెప్పిన సునీల్.. కాంగ్రెస్ ముక్త ఆంధ్రప్రదేశ్‌కు బీజం నాటిన నాయకుడిగా అభివర్ణించారు. చివర్లో తారకరామారావు గారికి 99 వ జయంతి వేడుకలుగా చెబుతూ గ్రీటింగ్స్ చెప్పారు.