బాలయ్య సరసన ఛాన్స్ ఆమెకి దక్కిందట!
- అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ బాలయ్యతో
- స్క్రిప్ట్ పై జరుగుతున్న కసరత్తు
- హీరోయిన్ గా తెరపైకి వచ్చిన మెహ్రీన్ పేరు
- ప్రియమణి ఖరారైనట్టుగా తాజా సమాచారం
ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ల వయసుగల తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఆయన కూతురు పాత్రలో శ్రీలీల నటించనుంది. ఇక అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' .. 'రాజా ది గ్రేట్' .. ' ఎఫ్ 3' సినిమాలలో మెహ్రీన్ చేయడం వలన, ఈ సినిమాలోనూ మెహ్రీన్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రియమణి కనిపించనుందని తెలుస్తోంది.
కథా పరంగా బాలయ్య వయసుకి తగిన నాయిక ఆమెనే అని తీసుకున్నారట. 'నారప్ప' సినిమాలో ఆమె నటన కూడా ఈ సినిమాలోకి తీసుకోవడానికి కారణమైందని అంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనీ, బాలయ్యను ఇంతవరకూ ఎవరూ చూపించని విధంగా తాను చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పడంతో అందరిలో మరింత ఆసక్తి రేకెత్తుతోంది.