ఫైట్లు చేయడం ఈజీ .. కామెడీనే కష్టం: వరుణ్ తేజ్
- 'ఎఫ్ 3' ప్రమోషన్స్ లో బిజీగా వరుణ్ తేజ్
- ఈ కథలో అందరూ డబ్బునే ప్రేమిస్తారన్న వరుణ్
- అందరూ నాటకాలు ఆడుతూ ఉంటారంటూ వివరణ
- కామెడీ స్టార్స్ తో కలిసి నటించడం అంత ఈజీ కాదంటూ వ్యాఖ్య
"నేను, వెంకటేశ్ గారు కలిసి 'ఎఫ్ 2' సినిమాను థియేటర్స్ లో చూశాము. అప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ చూసి .. 'ఎఫ్ 3' తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ కథలో ఎవరి ప్రేమలోను నిజాయతీ ఉండదు .. అందరూ డబ్బునే ప్రేమిస్తూ మిగతా విషయాల్లో నటిస్తుంటారు .. నాటకమాడుతుంటారు.
ఇక ఈ సినిమాలోని వెంకటేశ్ గారికి రేచీకటి .. నాకు నత్తి. అలాంటి ఇద్దరం ఒక రాత్రివేళలో కలుసుకుంటాము. అప్పుడు చోటుచేసుకునే సన్నివేశాలు తెరపై చూడవలసిందే. ఈ సారి సునీల్ తో కలిసి కామెడీని షేర్ చేసుకోవడం మరింత ఫన్ గా అనిపించింది. వెంకటేశ్ .. సునీల్ .. అలీ లాంటివారితో కలిసి కామెడీ చేయడం కంటే ఫైట్లు చేయడమే ఈజీ అనిపించింది" అని చెప్పుకొచ్చాడు.