ఏపీలో రూ.5,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ఆర్సెలర్ మిట్టల్ ప్రకటన
- గ్రీన్‌కో ప్రాజెక్టులో భాగస్వామిగా ఆర్సెలర్ మిట్టల్
- కర్నూలు పరిధిలోని ఈ ప్రాజెక్టులో రూ.4,600 కోట్ల పెట్టుబడి
- విశాఖ ప్లాంట్ విస్తరణకు రూ.1,000 కోట్లు
- మొత్తంగా ఏపీలో రూ.5,600 కోట్లను పెడుతున్నట్లు కంపెనీ ప్రకటన
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా మంగళవారం ఏపీ సీఎం జగన్‌తో ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ చైర్మన్ ఆదిత్య మిట్టల్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విశాఖలోని తన ప్లాంట్ విస్తరణ నిమిత్తం రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడిపైనా ఆ కంపెనీ అధికారికంగా బుధవారం ప్రకటన చేసింది. ఈ రెండు పెట్టుబడుల ద్వారా ఏపీలో తన పెట్టుబడి రూ.5,600 కోట్లకు చేరినట్లు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ ప్రకటించింది.