కాబోయే భర్తతో కలిసి వళుత్తియూరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నయనతార!
- పెళ్లిపీటలు ఎక్కనున్న నయన్, విఘ్నేశ్ శివన్
- తిరుమలలో పెళ్లి చేసుకోనున్న ప్రేమ జంట
- కులదైవం పాదాల చెంత తొలి పెళ్లి పత్రికను పెట్టిన జంట
తాజాగా వీరిద్దరూ తమ కులదైవం ఆలయానికి వెళ్లారు. చెన్నై నుంచి తిరుచ్చికి విమానంలో వెళ్లిన వీరు... అక్కడి నుంచి తంజావూరు జిల్లా అయ్యంపేట వళుత్తియూరికి వెళ్లి అక్కడ ఉన్న కులదైవం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కులదైవం పాదాల చెంత తొలి పెళ్లి పత్రికను పెట్టినట్టు సమాచారం. జూన్ 9వ తేదీన వీరి వివాహం జరగనుంది. మరోవైపు పెళ్లి కారణంగా నయనతార ఏ సినిమాలోనూ నటించడం లేదు.