'థ్యాంక్యూ' సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఖరారు!
- విక్రమ్ కుమార్ తాజా చిత్రంగా రూపొందిన 'థ్యాంక్యూ'
- చైతూ సరసన సందడి చేయనున్న ముగ్గురు హీరోయిన్స్
- ఈ నెల 25వ తేదీన టీజర్ రిలీజ్
- జులై 8వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 5:04 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. స్టైలీష్ లుక్ తో నాగచైతన్య కనిపిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా కథానాయికగా అలరించనుంది.
కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. మరో ఇద్దరు కథానాయికలుగా అవికా గోర్ .. మాళవిక నాయర్ నటించారు. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత పరశురామ్ తో కలిసి చైతూ సెట్స్ పైకి వెళ్లనున్నాడు
.