పెట్రో ధరల వ్యవహారం... కేంద్రంపై భగ్గుమన్న తమిళనాడు
- దేశంలో తగ్గిన ఇంధన ధరలు
- పెట్రోల్, డీజిల్ పై భారీగా తగ్గిన ఎక్సైజ్ సుంకం
- రాష్ట్రాలు కూడా పన్నులు తగ్గించాలంటున్న బీజేపీ నేతలు
- పెంచినప్పుడు మాకు చెప్పారా? అంటూ తమిళనాడు మంత్రి ఫైర్
పెట్రో ధరలు పెంచినప్పుడు మమ్మల్ని అడిగి పెంచారా? అంటూ నిలదీశారు. అలాంటప్పుడు పన్నులు తగ్గించాలని మమ్మల్నెలా అడుగుతారు? అని ప్రశ్నించారు. అది కూడా గతంలో పెంచిన ధరల నుంచి కొద్దిగా తగ్గించారని త్యాగరాజన్ విమర్శించారు. గతంలో ఇంధన ధరలు పెంచినప్పుడు ఏనాడూ కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోలేదని, ఏకపక్షంగా ముందుకెళ్లిందని పేర్కొన్నారు. ఇప్పుడు పన్నులు తగ్గించాలంటూ రాష్ట్రాలకు చెబుతోందని, ఇది సమాఖ్య స్ఫూర్తి అనిపించుకుంటుందా? అని వ్యాఖ్యానించారు.