ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి.. కేంద్రంలా సీఎం జగన్ కూడా వ్యాట్ తగ్గించాలి: జీవీఎల్
- ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం
- తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- మోదీకి కృతజ్ఞతలు తెలిపిన జీవీఎల్
అయితే, వైసీపీ ప్రభుత్వం వ్యాట్ ను విపరీతంగా పెంచడంతో ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని జీవీఎల్ ఆరోపించారు. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఏపీ సీఎం జగన్ కూడా కేంద్రం తరహాలోనే భారీగా వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతుందని జీవీఎల్ హెచ్చరించారు.