తుగ్లక్ కూడా నవ్వుకునేలా జగన్ పాలన: మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి
- రాజ్యసభ సీట్లను జగన్ అమ్ముకున్నారన్న వీరశివారెడ్డి
- కేసుల నుంచి బయటపడేందుకే వారికిచ్చారంటూ వ్యాఖ్యలు
- 2024 ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమన్న శివారెడ్డి
వైసీపీ రాజ్యసభ సీట్లకు ఎంపిక చేసిన ఆర్. కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు ఏ రాష్ట్రానికి చెందిన వారని ప్రశ్నించిన వీర శివారెడ్డి... వారు ఏపీలోని ఏ జిల్లాకు చెందిన వారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీలో రాజ్యసభకు వెళ్లే అర్హత కలిగిన నేతలు లేనందుననే జగన్ రెండు సీట్లను తెలంగాణకు చెందిన వారికి కేటాయించారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో జగన్‌కు బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.