ఉత్సాహభరిత వాతావరణంలో 'శేఖర్' ప్రీ రిలీజ్ ఈవెంట్
- రాజశేఖర్ హీరోగా 'శేఖర్' మూవీ
- దర్శకత్వం వహించిన జీవిత
- మే 20న రిలీజ్
- నేడు హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
బొగ్గరం వెంకట శ్రీనివాస్, బీరం సుధాకర్ రెడ్డిలతో పాటు రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్నారు. ఇందులో మలయాళ నటి ఆత్మీయ రాజన్ కథానాయిక. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పకుడు. టారస్ సినీ కార్ప్, పెగాసస్ సినీ కార్ప్, త్రిపుర క్రియేషన్స్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ బ్యానర్లపై ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇటీవలే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేపట్టింది.


