ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
- గత నెల 29 నుంచి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్
- అక్కడే మంత్రులతో సమావేశాలు నిర్వహించిన వైనం
- ప్రగతి భవన్ కు చేరుకోగానే వరుస సమావేశాలతో బిజీగా ఉన్న సీఎం
ఇక రాజ్యసభకు పోటీ పడే టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ రేపు ఖరారు చేయనున్నారు. ఎల్లుండి రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు నుంచి ముఖ్యమంత్రి వరుస సమీక్షలు, సమావేశాలతో బిజీగా గడపనున్నారు.