ఇంతకీ కీర్తి సురేశ్ కి హిట్ పడినట్టేనా?
- 'మహానటి' తరువాత గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేశ్
- నిరాశపరిచిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు
- ఇతర భాషల్లోను వరుస పరాజయాలే
- వీకెండ్ తరువాత తేలిపోనున్న 'సర్కారువారి పాట' ఫలితం
చాలా గ్యాప్ తరువాత తెలుగుకు వచ్చి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రెండు చేసింది. ఆ సినిమాలను ఆమె ఎందుకు చేసిందనేది ఆడియన్స్ కి ఇప్పటికీ అర్థం కాలేదు. 'మహానటి' తరువాత దాదాపు ఆమె స్టార్ హీరోల సినిమాల్లోనే చేసింది. ఆ జాబితాలో రజనీ .. మోహన్ లాల్ .. విక్రమ్ వంటి సీనియర్ హీరోలు కూడా ఉన్నారు.
కానీ ఏ సినిమా కూడా కీర్తి సురేశ్ కి హిట్టు పట్టుకురాలేకపోయింది. దాంతో అంతా కూడా 'సర్కారువారి పాట' పైనే దృష్టి పెట్టారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో కీర్తి సురేశ్ ఖాతాలో హిట్ పడినట్టేనా? అనే డౌట్లు అంతటా వ్యక్తమవుతున్నాయి. వీకెండ్ తరువాత ఈ ప్రశ్నకి సమాధానం దొరికిపోతుందనే చెప్పచ్చు.