రేపు బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవం... కేంద్రం కూడా నిధులు కేటాయించిందన్న కిషన్ రెడ్డి
- సాగర్ సమీపంలో బుద్ధవనం ప్రాజక్టు
- కేంద్ర పర్యాటక శాఖ నుంచి రూ.22.24 కోట్లు
- కేటీఆర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ల చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. బుద్ధవనం ప్రాజెక్టును శనివారం తెలంగాణ మంత్రులు ప్రారంభించనున్నారంటూ కిషన్ రెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర పర్యాటక శాఖ నుంచి రూ.22.24 కోట్ల నిధులు విడుదలయ్యాయని కూడా ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్టును శనివారం తెలంగాణ మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ప్రారంభించనున్నారు.