వైజాగ్ లో సందడి చేసిన రాజ'శేఖర్' టీమ్.. ఫొటోలు ఇవిగో!
- ఈ నెల 20న విడుదలవుతున్న 'శేఖర్'
- ఆంధ్రా యూనివర్శిటీలో నిన్న సాయంత్రం భారీ ప్రమోషన్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గుడివాడ అమర్ నాథ్
మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. చిత్ర యూనిట్ నిన్న వైజాగ్ లో సందడి చేసింది. నిన్న సాయంత్రం 5 గంటలకు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహుడిని చిత్ర యూనిట్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనంతరం సాయంత్రం 7 గంటలకు ఆంధ్రా యూనివర్శిటీలో ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్, జీవిత, వీరి కుమార్తెలు శివాని, శివాత్మికలతో పాటు నిర్మాతలు హాజరయ్యారు. ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
రాజశేఖర్, జీవితల పెద్ద కూతురు శివాని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో టారస్ సినీ కార్ప్, పెగాసన్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ పతాకాలపై శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గారం ఈ చిత్రాన్ని నిర్మించారు.



