ఎన్టీఆర్ స్క్రిప్ట్ పై మరోసారి కసరత్తు చేస్తున్న కొరటాల!
- వరుస సక్సెస్ లతో వచ్చిన కొరటాల
- నిరాశపరిచిన 'ఆచార్య' ఫలితం
- తదుపరి సినిమా ఎన్టీఆర్ తో
- మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కొరటాల
అలాంటి కొరటాల నుంచి ఇటీవల 'ఆచార్య' సినిమా వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇంత సమయం తీసుకుంటే వచ్చిన అవుట్ పుట్ ఇదా? అంటూ ప్రేక్షకులు పెదవి విరిచేశారు. దాంతో ఇప్పుడు తాను తీయబోయే ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పై కొరటాల మరోసారి దృష్టి పెట్టినట్టుగా చెబుతున్నారు.
కథలో అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయా? లేదా? ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలేమైనా వదిలేస్తున్నామా? డైలాగ్స్ ఎన్టీఆర్ స్థాయికి తగినట్టుగా ఉన్నాయా? లేదా? అనేవి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నాడట. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. కథానాయికలుగా రష్మిక .. కీర్తి సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి.