ఒంగోలు వరకు ‘ఉదయ్’ డబుల్ డెక్కర్ రైలు పొడిగింపు!
- ప్రస్తుతం వైజాగ్-విజయవాడ మధ్య పరుగులు
- విజయవాడలో ఆరున్నర గంటలపాటు ఖాళీగానే రైలు
- ఒంగోలు వరకు పొడిగించాలన్న ప్రతిపాదనకు అధికారుల అంగీకారం!
- నిర్వహణ నుంచి రెండో రైలు వచ్చాక పొడిగింపు!
ఉదయ్ రైలుకు ప్రారంభంలో పది బోగీలు ఉండగా ఆ తర్వాత మూడింటిని తొలగించి ఏడింటితోనే నడుపుతున్నారు. తొలగించిన వాటిని కూడా తిరిగి కలపాలన్న డిమాండ్ కూడా ఉంది. కాగా, అత్యంత రద్దీమార్గమైన విశాఖపట్టణం-విజయవాడ మధ్య పరుగులు తీసే డబుల్ డెక్కర్ రైలులో 80 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదవుతోంది.
తెల్లవారుజామున 5.35 గంటలకు ఈ రైలు విశాఖపట్టణంలో బయలుదేరి 11 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 10.55 గంటలకు విశాఖ చేరుకుంటుంది. అయితే, విజయవాడ చేరుకున్న తర్వాత దాదాపు 6.30 గంటలపాటు రైలు ఖాళీగా ఉంటుండడంతో రైలును పొడిగించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.