రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్షపై సీఎం జగన్ స్పందన
- గతేడాది గుంటూరులో దారుణ హత్య
- బీటెక్ విద్యార్థిని రమ్యను పొడిచి చంపిన శశికృష్ణ
- దోషిగా నిర్ధారించిన స్పెషల్ కోర్టు
- శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ నేడు తీర్పు
- తీర్పును స్వాగతిస్తున్నట్టు సీఎం జగన్ ట్వీట్
కాగా, కోర్టు తీర్పుపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నానని వెల్లడించారు. ఈ కేసు విషయంలో పోలీస్ శాఖ వేగంగా దర్యాప్తు పూర్తి చేసిందని కితాబిచ్చారు. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీస్ శాఖకు అభినందనలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.