వైసీపీ అండతో చెలరేగిపోతున్న నేరగాళ్లకు ఈ తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్
- రమ్యను హత్య చేసిన శశికృష్ణకు ఉరిశిక్ష విధించిన కోర్టు
- కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న నారా లోకేశ్
- జగన్ పాలనలో 800 మంది మహిళలపై దారుణాలు జరిగాయని వ్యాఖ్య
టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిస్తూ రమ్య హంతకుడికి ఉరిశిక్షను విధించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. వైసీపీ అండతో చట్టాన్ని చుట్టం చేసుకుని చెలరేగిపోతున్న నేరగాళ్లకు కోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు. జగన్ పాలనలో ఇప్పటి వరకు 800 మంది మహిళలపై దారుణాలు జరిగాయని చెప్పారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.