పంట పొలాల్లో రేవంత్ రెడ్డి... రాహుల్ సభకు రావాలంటూ రైతులకు ఆహ్వానం
- రాహుల్ సభ జనసమీకరణలో రేవంత్‌రెడ్డి
- నాగార్జున సాగర్ పరిధిలో పర్యటన
- పంట పొలాల్లో అన్నదాతలతో మాటా మంతి
- రాహుల్ సభ ఉద్దేశాలను వివరించిన టీపీసీసీ చీఫ్
ఇలా పంట పొలాల్లో అన్నదాతలతో కలిసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి చెందిన ఓ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో రైతు దంపతులతో మాట్లాడుతున్న రేవంత్...వరంగల్‌లో రాహుల్ గాంధీ సభను ఎందుకు నిర్వహిస్తున్నామో తెలిపారు. అటు కేంద్రంలో నరేంద్ర మోదీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలు రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయని, వాటిపై గట్టిగా ప్రశ్నించేందుకే రాహుల్ గాంధీ సభ పెడుతున్నట్లు చెప్పారు. ఈ సభకు రావాలని రేవంత్ అనగానే... ఇలాంటి సభ ఎక్కడ పెట్టినా వస్తామని అన్నదాత బదులిచ్చారు.