పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజి అవాస్తవం: మంత్రి బొత్స
- ఏపీలో నిన్న, ఇవాళ పేపర్ లీక్ అంటూ వార్తలు
- కొట్టిపారేసిన బొత్స
- ఎల్లో మీడియా దుష్ప్రచారం అంటూ ఆరోపణలు
- తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు
రాష్ట్రంలో నిన్నటి నుంచి పరీక్షలు జరుగుతున్నాయని, నంద్యాలలోని ఓ పాఠశాలలో పరీక్ష పేపరును ఓ క్లర్క్ ఫొటో తీశాడని వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఆ ఫొటో బయటికి వచ్చిందని, అది లీక్ ఎలా అవుతుందని బొత్స ప్రశ్నించారు. ఈ ఘటన జరగ్గానే తాము అప్రమత్తమై తగిన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇవాళ కూడా పేపర్ లీక్ అంటూ ఓ మీడియా చానల్లో వార్తలు వస్తే, వెంటనే ఆరా తీశామని, లీక్ కాలేదన్న విషయం స్పష్టమైందని అన్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల వచ్చే లాభమేంటో ఆయా పత్రికలు, చానళ్లు గ్రహించాలని హితవు పలికారు.