పవన్ .. బన్నీలపైనే కొరటాల దృష్టి!
- 'ఆచార్య' ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కొరటాల
- పవన్ తో సినిమా చేయాలనుందంటూ వెల్లడి
- బన్నీతో చేస్తాననే నమ్మకం ఉందంటూ వ్యాఖ్య
- ప్రభాస్ తో మరో సినిమా ఉంటుందంటూ స్పష్టీకరణ
'ఆచార్య' ప్రమోషన్స్ లో కొరటాల మాట్లాడుతూ .. " పవన్ కల్యాణ్ గారితో సినిమా చేయాలనుంది .. తప్పకుండా చేస్తాననే నమ్మకం ఉంది. నా మార్కు కథలు .. టేకింగ్ ఆయనకి దగ్గరగా ఉంటాయని భావిస్తున్నాను. అలాగే అల్లు అర్జున్ తో కూడా చేయాలనుకుంటున్నాను. ఆ అవకాశం కూడా త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను.
ఇక ప్రభాస్ తో మరో సినిమా చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్టులు ముగింపు దశకి చేరుకుంటే ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తుంది. చరణ్ సోలో హీరోగా కూడా ఒక సినిమా ఉంటుంది. ఆయన కోసం ఎలాంటి కథను తయారు చేయాలనే విషయంలో నాకంటూ ఒక స్పష్టత ఉంది" అని చెప్పుకొచ్చారు.