దమ్ముంటే రాహుల్ గాంధీని ఓయూకి రమ్మను: జగ్గారెడ్డికి కౌంటర్ ఇచ్చిన బాల్క సుమన్
- బాల్క సుమన్ పై జగ్గారెడ్డి ఫైర్
- నువ్వెంత, నీ బతుకెంత అంటూ వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసేంతటివాడివా అంటూ ఆగ్రహం
- జగ్గారెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ సుమన్ కౌంటర్
దమ్ముంటే రాహుల్ గాంధీని ఓయూకి రమ్మను అంటూ సవాల్ విసిరారు. అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాహుల్ ఓయూకి రావాలని స్పష్టం చేశారు. నేను తలుచుకుంటే నువ్వు తిరగ్గలవా?... జగ్గారెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఖబడ్దార్ జగ్గారెడ్డి... నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.