మా వాడు హీరో అవుతున్నాడు .. త్వరలోనే ఎనౌన్స్ చేస్తాం: సుమ
- చిన్నప్పటి నుంచి మా వాడు సినిమాలు ఎక్కువగా చూసేవాడన్న సుమ
- సినిమా డైలాగులే ఎక్కువగా చెప్పేవాడని వెల్లడి
- హీరోగా పరిచయం చేస్తామంటున్న సుమ
అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. సుమ తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఇటీవల వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన ప్రశ్ననే ఆమెకి అలీ నుంచి ఎదురైంది. అప్పుడు సుమ స్పందిస్తూ .. "చిన్నప్పటి నుంచి కూడా మా వాడు సినిమాలు ఎక్కువగా చూసేవాడు. చిన్నప్పుడు వాడు చూసిన సినిమాల్లో 'స్టూడెంట్ నెంబర్ వన్' .. 'ఆది' కూడా ఉన్నాయి.
అందువలన మాట్లాడితే వాడు 'అమ్మతోడు అడ్డంగా నరికేస్తా' అనేవాడు. వాడిని హీరోను చేసే విషయాన్ని త్వరలోనే ఎనౌన్స్ చేస్తాను" అని చెప్పుకొచ్చింది. ఇక సుమ ప్రధానమైన పాత్రను పోషించిన ' జయమ్మ పంచాయితీ' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతాన్ని కీరవాణి అందించిన సంగతి తెలిసిందే.