చిరంజీవి ఆచార్యకు U/A సర్టిఫికెట్
- కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య
- సెన్సార్ పనులు పూర్తి
- ట్విట్టర్ లో వెల్లడించిన కొణిదెల ప్రొ కంపెనీ
- రేపు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్
ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇటీవలే విడుదలైన 'భలే భలే బంజారా' పాటకు విశేష స్పందన లభిస్తోంది. రేపు (ఏప్రిల్ 23) ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరగనుంది.