దొంగలు బూట్లు ఎత్తుకెళ్లడంతో ఉత్త కాళ్లతో నడిచి వెళ్లిన ఎమ్మెల్యే... వీడియో ఇదిగో!
- ఉత్తరప్రదేశ్ లో ఘటన
- ఆగ్రాలో సతీమాత ఉత్సవాలు
- ప్రారంభోత్సవానికి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ
- పూజలు చేసి బయటికొచ్చేసరికి బూట్లు మాయం
ఎమ్మెల్యే బూట్లు కనిపించకపోవడంతో పోలీసులు, అధికారులు ఆగమేఘాలపై తనిఖీలు చేపట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో చేసేదిలేక ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ తన కారు వరకు ఉత్త కాళ్లతోనే నడిచి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.