కొత్త కాన్సెప్ట్ తో .. కొత్త లుక్ తో అనసూయ!
- యూత్ లో అనసూయకి మంచి క్రేజ్
- సినిమాల్లో పెరుగుతున్న అవకాశాలు
- నెగెటివ్ షేడ్స్ పాత్రల్లోను గుర్తింపు
- లైన్లో నాయిక ప్రధానమైన కథలు
గతంలోనే అనసూయ నాయిక ప్రధానమైన సినిమాలను టచ్ చేసింది. ఇప్పుడు అదే తరహాలో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఒకటి చేసింది. ఆర్వీ రెడ్డి .. మారం రెడ్డి శేషు ఈ సినిమాను నిర్మించారు. 'పేపర్ బాయ్' దర్శకుడు జయశంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.
ఈ సినిమా షూటింగు పార్టు పూర్తయిందనీ, ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా నిర్మితమైందని దర్శకుడు చెప్పారు. అనసూయ కొత్త లుక్ తో కనిపిస్తుందనీ, త్వరలోనే టైటిల్ ను ప్రకటిస్తామని అన్నారు. ఈ సినిమాకి 'అరి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సాయికుమార్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.