స్టార్ హీరోలకు నో చెప్పిన ప్రభుదేవా .. వడివేలు కోసం రంగంలోకి దిగాడు!
- 'నాయ్ శేఖర్'గా వడివేలు
- హాస్యప్రధానంగా సాగే కథ
- డాన్స్ మాస్టర్ గా ప్రభుదేవా
- దర్శకుడిగా సూరజ్
అలాంటి వడివేలు బాగా పాప్యులారిటీ వచ్చిన తరువాత రాజకీయాల్లో కుదురుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో స్టార్ హీరోలపై ఆయన చేసిన విమర్శలు సినిమాల్లో అవకాశాలు లేకుండా చేశాయి. వడివేలు కళ్లు తెరిచేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడు ఆయన హీరోగా 'నాయ్ శేఖర్' అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాకి సూరజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కామెడీ టచ్ తోనే ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలోని ఒక పాటకి ప్రభుదేవా కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. డాన్స్ మాస్టర్ గా చేయడానికి స్టార్ హీరోలకే నో చెబుతూ వస్తున్న ప్రభుదేవా, వడివేలుతో ఉన్న సాన్నిహిత్యంతోనే అంగీకరించాడని అంటున్నారు.