వడివేలు, ప్రభుదేవా కలిస్తే నవ్వులు ఆగుతాయా..?.. వీడియో చూడండి
- నాయ్ శేఖర్ రిటర్న్స్ షూటింగ్ సందర్భంగా భేటీ
- సింగ్ ఇన్ ద రైన్ పాటను పాడిన వడివేలు
- వీడియోను షేర్ చేసిన ప్రభుదేవా
‘సింగ్ ఇన్ ద రైన్’ అంటూ వడివేలు పాట పాడుతుంటే, పక్కనే ఉన్న ప్రభుదేవా నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రభుదేవా స్వయంగా షేర్ చేశారు. దానికి నాట్పు అనే క్యాప్షన్ తగిలించారు. అంటే స్నేహం అని అర్థం. రెండు దశాబ్దాల క్రితం నాటి వడివేలు కామెడీ హిట్ సినిమా 'మనదాయ్ తిరుదివిత్తాయ్'లోని మధుర క్షణాలను అభిమానులకు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ సినిమాలో మాదిరే వడివేలు పాటను ఆలపించారు.