ఈ నెల 16న సీఎం జగన్ కర్నూలు పర్యటన.. ఇదీ షెడ్యూల్
- ఎమ్మెల్యే శ్రీదేవి బావ కుమారుడి పెళ్లికి హాజరు
- ఎమ్మెల్యే ఇంట్లో వధూవరులకు ఆశీర్వాదం
- కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు
ఇదీ 16న సీఎం పర్యటన షెడ్యూల్..
ఉదయం 10.40: కడప నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు వెళతారు.
ఉదయం 10.50: అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కర్నూలు ఏపీ ఎస్పీ బెటాలియన్ కు చేరుకుంటారు.
ఉదయం 11.10: ఎమ్మెల్యే శ్రీదేవి ఇంటికి రోడ్డు మార్గంలో బయల్దేరుతారు.
ఉదయం 11.20: ఎమ్మెల్యే ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలో పాల్గొంటారు. 11.35 వరకు అక్కడే ఉంటారు.
ఉదయం 11.45: ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు తిరుగు పయనం.
మధ్యాహ్నం 12.05: ఓర్వకల్లు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు.