ఆయనే నా ఫేవరెట్ హీరో: 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్
- చిరంజీవే తన అభిమాన నటుడన్న ప్రశాంత్
- చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని వెల్లడి
- నా సినిమాలో హీరో చిరంజీవి మాదిరి ఉండాలనుకున్నానన్న ప్రశాంత్
తనకు స్ఫూర్తి చిరంజీవేనని ప్రశాంత్ నీల్ అన్నారు. చిన్నప్పటి నుంచి తాను చిరంజీవి సినిమాలు చూస్తూనే పెరిగానని చెప్పారు. తన ఫేవరెట్ హీరో చిరంజీవి అని తెలిపారు. తన సినిమాలో హీరోకు ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్, మాస్ ఎలిమెంట్ సీన్స్ చాలా బాగుంటాయని చెపుతుంటారని.... దీనికి కారణం చిరంజీవేనని చెప్పారు. చిరంజీవి సినిమాల్లో ఉండే ఈ సీన్స్ తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అన్నారు. తన సినిమాలో హీరో కూడా చిరంజీవి మాదిరే ఉండాలని అనుకున్నానని చెప్పారు.