'కార్తికేయ 2' రిలీజ్ డేట్ ఇదే!
- గతంలో నిఖిల్ కి హిట్ ఇచ్చిన 'కార్తికేయ'
- షూటింగును పూర్తిచేసుకున్న 'కార్తికేయ 2'
- కథానాయికగా అనుపమ పరమేశ్వరన్
- జూలై 22వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జూలై 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కథ నేపథ్యానికి తగినట్టుగానే శ్రీకృష్ణుడి ఆకారానికి సంబంధించిన కటింగ్ ఆకట్టుకుంటోంది. హీరో ఒక దివ్యమైన నగరాన్ని దర్శిస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది.
ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. 'కార్తికేయ' మాదిరిగా ఈ సినిమా కూడా తనకి పెద్ద హిట్ ఇస్తుందని నిఖిల్ భావిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. స్వాతి రెడ్డి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించినట్టుగా తెలుస్తోంది.