యూవీ క్రియేషన్స్ బ్యానర్లో కార్తికేయ!
- హీరోగా సక్సెస్ కోసం కార్తికేయ వెయిటింగ్
- 'వలిమై'లో విలన్ గా మంచి మార్కులు
- దర్శకుడు ప్రశాంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్
- త్వరలో టైటిల్ పోస్టర్ రిలీజ్
ఆయితే ఆ తరువాత ఆయన తమిళంలో విలన్ గా చేసిన 'వలిమై' అక్కడ బాగానే ఆడటం ఆయనకి కాస్త ఊరటను కలిగించే విషయం. ఈ నేపథ్యంలో తెలుగులో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. అందుకు సమాధానం రానే వచ్చేసింది. ప్రస్తుతం ఆయన యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇటీవలే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కినట్టుగా చెబుతున్నారు. కెరియర్ పరంగా కార్తికేయకు ఇది 8వ సినిమా. ఈ సినిమాకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సమాచారాన్ని తాజాగా ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేసి ప్రకటిస్తామని అన్నారు. అప్పుడు మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంది.