ఫస్టు సింగిల్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు చేసిన 'రామారావు'
- యాక్షన్ ఎంటర్టైనర్ గా 'రామారావు ఆన్ డ్యూటీ'
- రవితేజ సరసన ఇద్దరు కథానాయికలు
- వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ
- జూన్ 17న సినిమా విడుదల
ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతాన్ని అందించాడు. ఫస్టు సింగిల్ గా 'బుల్ బుల్ తారంగ్' అనే పాటను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెబుతూ అధికారిక పోస్టర్ ను వదిలారు. రాకేందుమౌళి సాహిత్యాన్ని అందించిన ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆలపించగా, శోభి మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు.
రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాకి, ఆయన కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చాలా కాలం తరువాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందన్నది చూడాలి.