భారీ జన సందోహం నడుమ వేడుకగా 'గని' ప్రీ రిలీజ్ ఈవెంట్
- వరుణ్ తేజ్ హీరోగా గని
- ఈ నెల 8న రిలీజ్
- వైజాగ్ లో ప్రీ రిలీజ్ వేడుక
- ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తప్పకుండా ప్రయత్నిస్తానని, మంత్రి అవంతి వైజాగ్ పై ఉన్న ప్రేమతో సలహా ఇచ్చారని, దాన్ని పాటిస్తానని వెల్లడించారు.
ఇక, తన కుమారుడు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ, తాను ఏ ఫంక్షన్ లో అయినా బన్నీ గురించి రెండు ముక్కల్లో ముగించేస్తుంటానని తెలిపారు. అయితే ఈ ఫంక్షన్ లో కొంచెం మాట్లాడతానని వివరించారు. ఇవాళ తన పతాకాన్ని ఎక్కడికి ఎగరేశాడో మీ అందరికీ తెలుసని అన్నారు.
"మా నాన్న అల్లు రామలింగయ్య పాలకొల్లు నుంచి మద్రాసు వెళ్లి నటుడయ్యారు. నేను నిర్మాతగా మారి చిత్రాలు తీస్తున్నాను. కానీ బన్నీ పుష్ప చిత్రంతో అంతర్జాతీయ స్థాయికి చేర్చి క్రికెటర్లు సైతం తన మేనరిజంను ప్రదర్శించేలా చేశాడు. అల్లు వారి పతాకాన్ని ఇంటర్నేషనల్ లెవల్ కి తీసుకెళ్లాడు. నేను ఎప్పుడూ మా కుటుంబ సభ్యులను ఇలా పొగడను. కానీ ఇవాళ తప్పకుండా అభినందించాలనిపిస్తోంది. అందుకే బన్నీకి అభినందనలు తెలుపుతున్నా" అంటూ తన ప్రసంగం ముగించారు.