'లైగర్' లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన మహాబలుడు మైక్ టైసన్
- విజయ్ దేవరకొండ హీరోగా లైగర్
- పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిత్రం
- కీలకపాత్ర పోషించిన మైక్ టైసన్
- అమెరికాలో టైసన్ పై సన్నివేశాల చిత్రీకరణ
ఈ నేపథ్యంలో, చిత్రయూనిట్ టైసన్ డబ్బింగ్ కు సంబంధించి ఓ వీడియోను పంచుకుంది. డబ్బింగ్ పనులు పూర్తయిన అనంతరం, టైసన్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటించింది. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్ బ్యానర్లపై లైగర్ తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.