మరోసారి జతకడుతున్న రజనీకాంత్, ఐశ్వర్యారాయ్.. దర్శకుడు ఎవరంటే..!
- రజనీ, ఐశ్వర్యల జంటగా 2010లో వచ్చిన 'రోబో'
- వీరిద్దరితో కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్న నెల్సన్ దిలీప్
- కీలక పాత్రలో ప్రియాంక అరుల్ మోహన్
రజనీ, ఐశ్వర్యల తాజా చిత్రానికి నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. మరోవైపు రజనీకి ఇది 169వ చిత్రం కాబోతోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒక కీలకపాత్రలో నటించబోతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.