కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న విద్యుత్తు బిల్లు రూ.40.75 మాత్రమే: ఏపీ మంత్రి బాలినేని
- మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.90
- తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌కు రూ.3
- ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.4.50
- అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.6.0
''కామన్ గ్రూపు వల్ల స్వల్పంగానే పెంపు. ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్ల విద్యుత్ వాడితే మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌కు రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.4.50, అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.6.0, చివరి 25 యూనిట్లకు యూనిట్‌కు రూ. 8.75 చొప్పున పడుతుంది.
ఆ విధంగా వినియోగదారునికి బిల్లు మొత్తం రూ.1,235.75 అవుతుంది. ఇదే బిల్లు పాత విధానం ధరల ప్రకారం అయితే మొత్తం బిల్లు రూ.1,195 వస్తుంది. అంటే కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న బిల్లు రూ.40.75 మాత్రమే'' అని చెప్పుకొచ్చారు.