బ్లాక్ మనీతో "హీరో" ఎండీ ఫాం హౌజ్ కొనుగోలు.. ఐటీ దాడులతో వెలుగులోకి
- ఇటీవలే హీరో మోటో కార్ప్‌పై ఐటీ దాడులు
- రూ.100 కోట్లతో ఫాం హౌజ్ కొన్న పవన్ ముంజాల్
- ఆ డబ్బంతా బ్లాక్ మనీయేనని గుర్తింపు
- రూ.1,000 కోట్లు వ్యయం చేసినట్టు తప్పుడు నివేదికలు
ఈ నిజాలన్నీ ఇటీవల ఆ కంపెనీపై జరిగిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో తేలాయి. ఐటీ దాడుల సందర్భంగా అటు హీరో గానీ, ఇటు ఐటీ అధికారులు పెద్దగా వివరాలు వెల్లడించకున్నా.. తాజాగా ఐటీ శాఖ హీరో యాజమాన్యం చీకటి కోణాలను బయటపెట్టింది. బ్లాక్ మనీతో ఫాం హౌజ్‌ను కొన్న పవన్ ముంజాల్ అందుకు ఏకంగా రూ.100 కోట్లను వెచ్చించారట.