ఎన్టీఆర్ కు మనం అందించే నివాళి అదే: బాలకృష్ణ
- టీడీపీ 40 వసంతాల వేడుకలు
- శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ
- కార్యకర్తలే టీడీపీకి కంచుకోట అని వెల్లడి
- పోరాటమే మన ఊపిరి అని ఉద్ఘాటన
నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా రెపరెపలాడుతోందంటే అందుకు లక్షల మంది కార్యకర్తలు, కోట్లాది ప్రజల ఆశీస్సులే కారణమని తెలిపారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో టీడీపీ కొత్త శకం లిఖించిందని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఎన్టీఆర్ కల్పించిన ఆస్తిహక్కు దేశానికే దిక్సూచి అయిందని వివరించారు. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టింది టీడీపీనే అని, ఎత్తిపోతల పథకాలతో రాష్ట్రం అన్నపూర్ణ అయిందంటే అది టీడీపీ ఘనతేనని బాలకృష్ణ పేర్కొన్నారు.