రాత్రివేళ సైకిల్‌పై పర్యటిస్తూ మహిళా ఐపీఎస్ గస్తీ.. వీడియో వైరల్: అభినందించిన స్టాలిన్
- ఫ్లవర్ బజార్ నుంచి చాకలిపేట వరకు గస్తీ
- అనుమానితులను విచారించిన రమ్యభారతి
- ఫొటోలు, వీడియోలు వైరల్
పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉన్నదీ, లేనిదీ స్వయంగా పర్యటించి తెలుసుకున్నారు. ఆ సమయంలో రోడ్లపై కనిపించిన అనుమానితులను విచారించారు. గురువారం రాత్రి ఆమె చెన్నైలోని ఫ్లవర్ బజార్ నుంచి చాకలిపేట వరకు సైకిల్‌పై గస్తీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి తిరిగి తిరిగి ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి చేరాయి. ప్రస్తుతం ఆయన దుబాయ్ పర్యటనలో ఉన్నారు. అయినప్పటికీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. రమ్యభారతికి అభినందనలు తెలిపారు.