'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఖరారు!
- రవితేజ తాజా చిత్రంగా 'రామారావు ఆన్ డ్యూటీ'
- దర్శకుడిగా శరత్ మండవ పరిచయం
- కథానాయికలుగా దివ్యాన్ష - రజీషా
- జూన్ 17వ తేదీన విడుదల
ఈ సినిమాతో దర్శకుడిగా శరత్ మండవ పరిచయమవుతున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. జూన్ 17వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. ఏప్రిల్ .. మే నెలలో భారీ సినిమాలు ఉండటమే అందుకు కారణం కావొచ్చు.
సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, దివ్యాన్ష కౌశిక్ - రజీషా విజయన్ కథానాయికలుగా అలరించనున్నారు. సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్ .. నరేశ్ .. పవిత్ర లోకేశ్ కనిపించనున్నారు.