ఐదు నెలల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంత పెరిగిందంటే..!
- హైదరాబాదులో లీటర్ పెట్రోల్ రూ. 109.10
- విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 110.80
- ఈ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలు
తెలంగాణలో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు, డీజిల్ 87 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.10కి, లీటర్ డీజిల్ ధర రూ. 95.49కి చేరుకుంది.
ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ 88 పైసలు, డీజిల్ 83 పైసలు పెరిగింది. దీంలో విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.80కి, డీజిల్ ధర రూ. 96.83కి చేరుకుంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.21కి, డీజిల్ రూ. 97.26కి చేరింది. రానున్న రోజుల్లో కూడా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఢిల్లీ, ముంబైలలో పెరిగిన ధరల వివరాలు:
ఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ. 96.21, డీజిల్ రూ. 87.47.
ముంబై: లీటర్ పెట్రోల్ రూ. 110.78, డీజిల్ రూ. 94.94.