దుమ్మురేపిన సితార, మహేశ్ బాబు... పెన్నీ సాంగ్ ఆల్ టైమ్ రికార్డు
- సర్కారు వారి పాట నుంచి రెండో పాట
- తమన్ బాణీలకు అనంత శ్రీరామ్ సాహిత్యం
- పాటలో తళుక్కుమన్న సితార పాప
- 24 గంటల్లో కోటికి పైగా వ్యూస్
దీనికి సంబంధించిన మ్యూజిక్ వీడియోలో సితార పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఈ పాటకు తమన్ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చాడు. టెక్నో పాప్ తరహాలో పాట సాగగా, సితార డ్యాన్స్ మూవ్ మెంట్స్ సైతం అందుకు అనుగుణంగా లయబద్ధంగా ఉన్నాయి. మొత్తానికి ఈ మ్యూజిక్ వీడియోలో తండ్రితో కలిసి సితూ పాప అదరగొట్టింది.
పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.