‘స్టెల్త్ ఒమిక్రాన్’తో వణుకుతున్న చైనా.. పలు నగరాల్లో లాక్‌డౌన్
- విస్తరిస్తున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్ ‘స్టెల్త్ ఒమిక్రాన్’
- ఈ వేరియంట్‌తో మరణాలు తక్కువేనంటున్న నిపుణులు
- భారీగా నమోదవుతున్న కేసులు
అయితే, ఈ వేరియంట్‌తో మరణాలు సంభవించే అవకాశం లేనప్పటికీ వేగంగా విస్తరిస్తోందని, ఫలితంగా ప్రజల ఆర్థిక, సామాజిక జీవితాలు అతలాకుతలమయ్యే అవకాశం ఉందని షాంఘై పుడాన్ యూనివర్సిటీకి చెందిన జాంగ్ వెన్‌హాంగ్ పేర్కొన్నారు. గత 24 గంటల్లో 1337 కేసులు నమోదు కావడం, ఒక్క జిలిన్ ప్రావిన్సులోనే 895 కేసులు వెలుగు చూడడంతో ప్రభుత్వం ఆంక్షలను కట్టుదిట్టం చేసింది. రాజధాని బీజింగ్‌లో ఆరు కేసులు, షాంఘైలో 41 కేసులు నమోదయ్యాయి.
కోటిన్నరకు పైగా జనాభా ఉన్న షెన్‌జెన్ నగరాన్ని ప్రభుత్వం దిగ్బంధించింది. చాంగ్‌చున్ నగరంలో శుక్రవారం నుంచే లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాలంటే అధికారుల అనుమతి తప్పనిసరి. షెన్‌జెన్ వాసులకు ఇప్పటికే మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించింది.