ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమాకి ఎనౌన్స్ మెంట్ డేట్ ఖరారు!
- ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాలతో
- ఆ ప్రాజెక్టుతో పాటే బుచ్చిబాబు సినిమా
- పరిశీలనలో 'పెద్ది' టైటిల్
- స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ
- ఏప్రిల్ 11న అధికారిక ప్రకటన
అయితే నిజంగానే ఈ కాంబినేషన్ సెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ కాంబినేషన్ ను పెర్ఫెక్ట్ గా సెట్ చేశారు. అందుకు సంబంధించిన ప్రకటనను ఏప్రిల్ 11వ తేదీన చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ రోజున ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక సమాచారంతో పాటు మిగతా వివరాలు తెలిసే అవకాశం ఉంది.
'ఆర్ ఆర్ ఆర్' తరువాత కొరటాలతో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత బుచ్చిబాబుతో చేయవచ్చునని అనుకోవడం సహజం. కానీ కొరటాల సినిమాతో పాటే బుచ్చిబాబు సినిమాను కూడా పూర్తిచేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.