'సర్కారువారి పాట' లెక్కలు మారిపోయాయే!
- ముగింపు దశలో 'సర్కారువారి పాట'
- మహేశ్ సరసన నాయికగా కీర్తి సురేశ్
- పాన్ ఇండియా స్థాయి రిలీజ్ ఆలోచన
- తెలుగుతో పాటే హిందీ .. తమిళ వెర్షన్లు
తమన్ ఈ సినిమాకి బాణీలను అందించాడు. ఈ సినిమా నుంచి వదిలిన 'కళావతి' సాంగ్ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకుపోతూనే ఉంది. ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయి ఆలోచన లేదనే వార్తలు వచ్చాయి.
కానీ మారుతున్న ట్రెండ్ కి తగినట్టుగా ఈ సినిమాను కూడా తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఆ దిశగా పనులు జరుగుతున్నాయట. ఈ విషయంతో పాటు మిగతా భాషల్లో ఎప్పుడు రిలీజ్ చేయనున్నది త్వరలో వెల్లడి చేస్తారని సమాచారం.