'భీమ్లా నాయక్' హిందీ రిలీజ్ ను అలా ప్లాన్ చేశారట!
- సంచలన విజయాన్ని సాధించిన 'భీమ్లా నాయక్'
- 100 కోట్ల షేర్ ను రాబట్టిన సినిమా
- హిందీలో రీలీజ్ చేయడానికి సన్నాహాలు
- ఏప్రిల్లో అక్కడి థియేటర్స్ లో దింపే ప్రయత్నం
100 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమాను తెలుగుతో పాటే హిందీలో రిలీజ్ చేయాలని భావించారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చేసుకున్నారు. రీసెంట్ గా హిందీ ట్రైలర్ ను కూడా వదిలారు. ఇక రేపో మాపో ఈ సినిమా హిందీ రిలీజ్ డేట్ ప్రకటన వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ హిందీ వెర్షన్ ను ఈ నెలలో రిలీజ్ చేయడం లేదట.
ప్రభాస్ 'రాధేశ్యామ్' పాన్ ఇండియా సినిమాగా ఈ నెల 11వ తేదీన విడుదలవుతోంది. ఎంతలేదన్నా ఒక రెండు వారాలపాటు ఏ థియేటర్లలో చూసినా ఈ సినిమానే ఉంటుంది. ఆ తరువాత 'ఆర్ ఆర్ ఆర్' రంగంలోకి దిగుతోంది. అందువలన ఏప్రిల్లో 'భీమ్లా నాయక్' హిందీ వెర్షన్ ను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.