'ఏజెంట్' నుంచి మమ్ముట్టి ఫస్టులుక్!
- స్పై థ్రిల్లర్ గా 'ఏజెంట్'
- అఖిల్ జోడీగా సాక్షి వైద్య
- సంగీత దర్శకుడిగా హిపాప్
- త్వరలో రిలీజ్ డేట్ ప్రకటన
ఈ రోజున ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలైంది. డిఫరెంట్ లుక్ తో అఖిల్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా సాక్షి వైద్య తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ కథలో కీలకంగా కనిపించే పవర్ఫుల్ పాత్రను మమ్ముట్టి పోషిస్తున్నారు. కొంతసేపటి క్రితం ఆయన ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.
ఒక ఆపరేషన్ కోసం యాక్షన్ లోకి దిగిన మమ్ముట్టి స్టిల్ ఆకట్టుకుంటోంది. గతంలో సురేందర్ రెడ్డి - వక్కంతం వంశీ కాంబినేషన్లో మంచి హిట్స్ వచ్చాయి. అలాగే ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.