రవీంద్ర జడేజా పెద్ద మనసు.. బయటపెట్టిన రవిచంద్రన్ అశ్విన్
- జయంత్ యాదవ్ తో కొన్ని ఓవర్లు వేయించాలన్నది ఆలోచన
- ఎవరు త్యాగం చేయాలన్న ప్రశ్న ఎదురైంది
- అప్పుడు జడ్డూ ముందుకొచ్చాడు
- మ్యాచ్ సందర్భంగా జరిగింది వివరించిన అశ్విన్
కొన్ని ఓవర్లను జయంత్ యాదవ్ తో వేయిద్దామన్నది కెప్టెన్ రోహిత్ శర్మ ఆలోచన. ‘‘జయంత్ ఎక్కువ బౌలింగ్ చేయలేదని నేను, జడేజా అర్థం చేసుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం రాకపోవడం కష్టంగానే ఉంటుంది. దాంతో రోహిత్ కొన్ని ఓవర్ల పాటు అయినా జయంత్ తో బౌలింగ్ చేయిద్దామని అనుకున్నాడు. అప్పుడు ఎవరు త్యాగం చేయాలన్న ప్రశ్న ఎదురైంది. దాంతో జడ్డూ ముందుకు వచ్చి జయంత్ కోసం ఓవర్లను త్యాగం చేశాడు. ఆ తర్వాత నేను కూడా అదే పనిచేశాను. జడ్డూ నిజంగా ఉదారమైన మనసుతో ముందుగా తానే బాల్ ఇచ్చాడు’’ అని అశ్విన్ జరిగిన విషయాన్ని వివరించాడు.