ఆ ముగ్గురు స్టార్స్ తో నటించాలనుంది: పూజ హెగ్డే
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'రాధే శ్యామ్'
- ఏప్రిల్లో రానున్న 'ఆచార్య'
- రంగంలోకి దిగనున్న 'బీస్ట్'
- పూజ మనసులో ఉన్న హీరోలు వీరే!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో .. ' ఏ హీరోలతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు?' అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. అందుకు పూజ హెగ్డే స్పందిస్తూ .. కమల్ .. రణ్ బీర్ కపూర్ .. ధనుశ్ లతో కలిసి నటించే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఆ అవకాశం త్వరగా రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది.
పూజ హెగ్డేకి ఒక రేంజ్ లో డిమాండ్ ఉంది కనుక, ఆమె కోరిక నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమిళంలో విజయ్ జోడీగా ఆమె చేసిన 'బీస్ట్' కూడా త్వరలో విడుదల కానుంది. ఇక తెలుగులో చరణ్ సరసన చేసిన 'ఆచార్య' కూడా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మాత్రం ఆమె దృష్టి అంతా 'రాధే శ్యామ్' పైనే ఉంది.